వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఈయన అ!’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. మళ్ళి నాని గ్యాప్ తీసుకుని మరో సినిమాను నిర్మించబోతున్నాడు. సీనియర్ అండ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథ ఒకటి నానికి బాగా నచ్చిందట. దాంతో ఆ సినిమాని తనే నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా ప్రకటించలేదు. ఇక నాని, సమంత గతంలో హీరో హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ షూటింగ్ లో బిజీగా ఉండగా, సమంత నాగ చైతన్యతో ‘మజిలీ’ షూటింగ్ లో బిజీగా ఉంది.

samantha