f2 సినిమాతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’ సినిమా ఈ నెల 20న విడుకల కాబోతుంది. తాజాగా వరుణ్ ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. వెంకటాద్రి ఎక్సప్రెస్, ఎక్సప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలను తీసాడు మేర్లపాక గాంధీ. ఆయన తీసిన సినిమాలన్నీ మంచి పేరు తెచ్చుకున్నాయి.

ఇప్పుడు తీయబోయే సినిమా కమర్షియల్ అంశాలతో పాటు వినోదాత్మకంగా ఉండబోతుందట. గాంధీ చెప్పిన కథ నచ్చడంతో వరుణ్ ఈ సినిమాకు వెంటనే అంగీకరించాడట. డిసెంబర్ లో సినిమా స్టార్ట్ చేసి సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తారట. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు.