మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తున్నప్పటికీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు రివ్యూలు కూడా నెగిటివ్ గా ఇచ్చారు. ఊహించని విధంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 26 కోట్ల షేర్ ను రాబట్టి షాక్ ఇచ్చింది. అలాగే టాలీవుడ్ లో ‘బాహుబలి’ తరువాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా సీడెడ్ లో బాహుబలి 2 రికార్డు ను బద్దలుకొట్టింది. అక్కడ బాహుబలి 2 రూ. 6కోట్ల షేర్ రాబట్టగా వినయ విధేయ రామ రూ.7.20కోట్ల షేర్ ను రాబట్టింది. మరి రానున్న రోజుల్లో బాక్సాఫిస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి.