డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌ఎస్‌ భారతి(73)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీలను కించ పరిచే విధంగా మాట్లాడారని ఆయన్ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన కలైంజర్‌ రీడింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ షెడ్యూల్ కులాన్నీ అవమానించేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆర్‌ఎస్‌ భారతిపై ఆరోపణలు ఉన్నాయి. దళిత సంస్థ ఆది మిజార్ పెరవై నాయకుడు అరుణ్ కుమార్ పిర్యాదు మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు.

అయితే అన్నా డీఎంకే పార్టీ పార్టీ తనపై కక్ష కట్టిందని ఇలాంటి వాటికి తానూ భయపడనని ప్రభుత్వ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు.

జూన్ చివరి నాటికి భారత్ లో 10 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందట..!

6 రోజుల కవలలకు కరోనా వైరస్ సోకడంతో తీవ్ర కలకలం