బీసీసీఐ చైర్మన్ గా మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎప్పటి నుంచో డే/నైట్ టెస్ట్ పై నాన్చుడు ధోరణితో అవలంబిస్తున్న వారికి షాక్ ఇస్తూ తన హయాంలో జరగనున్న మొదటి టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ తో టీమిండియా మొదటి డే/నైట్ టెస్ట్ కు శ్రీకారం చుట్టాడు. ఈ మ్యాచ్ చూడటానికి చాల మంది ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారట. ఇక టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని డే/నైట్ టెస్ట్ సిరీస్ లో తళుక్కుమననున్నాడని తెలుస్తుంది.

ఈ మ్యాచ్ కోసం మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ వ్యాఖ్యాతగా సందడి చేయనున్నాడు. 2014 ఆస్ట్రేలియా సిరీస్ తరువాత ధోని టెస్ట్ లకు వీడ్కోలు పలికాడు. ఆ తరువాత ఎప్పుడు టెస్ట్ సిరీస్ లు జరిగేటప్పుడు మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఇక మొదటి సారి ఇలా కామెంటేటర్ గా అడుగుపెట్టనుండటంతో అభిమానులకు కొంత ఆసక్తిగా మారింది. ఈనెల 22వ తేదీన ఈడెన్ గార్డన్స్ వేదికగా భారత్ – బంగ్లా దేశ్ మధ్య చారిత్రాత్మకమైన డే/నైట్ మ్యాచ్ మొదలు కానుంది.