ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా మాజీ కెప్టెన్ ఏంఎస్ ధోని వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గత ఏడాది డాక్యుమెంటరీతో వినోద పరిశ్రమలో అడుగుపెట్టిన ధోని.. ఇప్పుడు తాజాగా ఓ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్నీ ధోని ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అతడి భార్య సాక్షి బుధవారం వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్ చాలా ద్రిల్లింగ్ ఉంటుందన్న ఆమె.. ఇంకా ప్రచురితం కానీ ఓ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నామన్నారు.

ఇది ఓ పురాతన సైన్స్ ఫిక్షన్ కథ అని.. ఇది ఒక రహస్యమైన అఘోరి ప్రయాణాన్ని అన్వేషిస్తుందని అన్నారు. మారుమూల ద్వీపంలో హైటెక్ సదుపాయాలతో సెట్ వేశామని.. ఇక ఈ సిరీస్ లో నటించే నటీనటులతో పాటు దర్శకుడిని త్వరలోనే ఖరారు చేస్తామని సాక్షి తెలియచేసారు.

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!

సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్..!

వారిపై నాకు మరింత గౌరవం పెరిగిందన్న మీనా..!