ఏపీ సీఎం జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరిన ముద్రగడ.. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలన్నారు. మీరు అడిగిన వారికి అడగని వారికీ దానాలు చేస్తూ దానకర్ణుడు అనిపించుకుంటున్నారని.. అదే విధంగా కాపు రిజర్వేషన్లను కూడా అమలుచేయాలని కోరారు.

నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పూజలందుకుని చరిత్రలో నిలిచిపోవలె కానీ పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని లేఖలో ముద్రగడ హెచ్చరించారు. పాలకులు ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని.. పీఎం మోడీతో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై తేల్చాలని ముద్రగడ సీఎం జగన్ ను కోరారు.

బ్రేకింగ్: యుద్ధ భూమిలో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందట..!