సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అండదండలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదని అన్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ అనేక సందర్భాలలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిందన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి కొంత ప్లస్ అయ్యుండొచ్చు గాని ఆయన వల్ల మాత్రం అధికారంలోకి రాలేదన్నారు.

అయితే కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవడం వల్ల టీడీపీకి మైనస్ అయ్యిందని.. అలాగే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం కూడా పార్టీకి నష్టం చేకూరిందన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి పార్టీ పెట్టి నందమూరి తారకరామారావు సీఎం అయ్యారని.. అసలు భవిష్యత్తులో ఇండస్ట్రీ నుండి సీఎం ఎవరు అవుతారో చెప్పలేమన్నారు.