జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ స్థాయి ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ ను వెంట బెట్టుకొని వెళుతూ నాదెండ్ల సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. అలాంటి నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికలలో తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారని పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం గుంటూరు నగరంలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన రోజు ప్రకటించారు. కానీ నాదెండ్ల విషయంలో పవన్ కళ్యాణ్ వేరొకరకంగా ఆలోచించారట.

నాదెండ్ల మనోహర్ ను పార్లమెంట్ కు పోటీ చేయించి ఢిల్లీ స్థాయిలో తమ పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించేదానికి నాదెండ్ల మనోహర్ లాంటి ఉన్నత విద్యావంతుడైతే బాగుంటుందని అనుకుంటే నాదెండ్ల మాత్రం ససేమిరా అన్నారట. తాను తెనాలి నియోజకవర్గం అసెంబ్లీకే పోటీ చేస్తానని పట్టు బట్టి పవన్ కళ్యాణ్ చేత తెనాలి అసెంబ్లీ సీటుని ఖరారు చేయించుకున్నారని తెలుస్తుంది. నాదెండ్ల మనోహర్ కూడా జనసేన పార్టీని మొదటి నుంచి గమనిస్తూనే పార్లమెంట్ స్థానం అయితే కష్టమని, ఇప్పటికే తెనాలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొంది ఉండటంతో తనకు వచ్చే ఎన్నికలలో తెనాలి నుంచి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అలోచించి తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపారు.