కింగ్ నాగార్జున-నాగ చైతన్య ఓ మల్టిస్టారర్ సినిమాలో నటించబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం.

బంగార్రాజులో కూడా నాగార్జున-రమ్యకృష్ణ లు ప్రధాన పాత్రలు చేయబోతున్నారు. కాగా ఈ సినిమాలో నాగ చైతన్య జోడి కోసం కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో ఈ సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •