కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మంచి విజయాన్ని అందుకున్న “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకు సీక్వెల్ తీయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో కలసి నాగ చైతన్య చేయనున్నాడు. మన్మధుడు 2 సినిమాకంటే ముందే ఈ సినిమా గురించి డిస్కషన్ కంప్లీట్ అవ్వడంతో మన్మధుడు 2 సినిమా పూర్తి చేయగానే సెట్స్ మీదకు వెళ్ళవలసి ఉంది.

కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయడంలో లేట్ చేయడంతో ఈ సినిమా ఇప్పుడు ఆగిపోతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 సినిమా త్వరగా పూర్తి కావడంతో పాటు, త్వరలో బిగ్ బాస్ 3 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ షో దాదాపుగా 100 రోజుల పాటు నడవనుంది. 

మరో వైపు నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీ మామతో బిజీ బిజీగ ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివర్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేయవలసి ఉంది. నాగార్జున, నాగ చైతన్య బిజీ బిజీగా మారడంతో ఒకవైపున కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేయకపోవడంతో దాదాపుగా ఈ ఏడాది “సోగ్గాడే చిన్ని నాయన”  సినిమా సెట్స్ మీదకు వెళ్లే ప్రసక్తే లేదు. అప్పటి వరకు కళ్యాణ్ కృష్ణ…. నాగ్ – చైతు కోసం ఎదురు చూస్తాడా లేక మరో హీరోతో సినిమా చేయడానికి ముందుకు వెళ్తాడా అన్నది చూడాలి.  
  •  
  •  
  •  
  •  
  •  
  •