అక్కినేని నాగచైతన్య వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చైతు -సమంతల సినిమా ‘మజిలీ’ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ తో చైతు ‘వెంకీ మామ’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి 21నుండి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో చైతన్య నటించనున్నాడు. ఆల్రెడీ స్టోరీ నరేషన్ పూర్తి అయ్యి క్యాస్ట్ ను కూడా ఫైనల్ చేశారు. నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా నాగ చైతన్య మొదటి చిత్రం ‘జోష్’ ను దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరల ఇన్ని సంవత్సరాల తర్వాత మరో సినిమా చేస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •