వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్నాడు నాగచైతన్య. ఈ మధ్య చైతు నటించిన సినిమాలన్నీ పరాజయం పొందాయి. కాగా ఫిలిం నగర్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఏమిటంటే.. చైతు ఓ బాలీవుడ్ మూవీ రీమేక్ లో నటించబోతున్నాడట. అశ్విని అయ్యర్‌ తివారి తెరకెక్కించిన ‘బరైలీ కీ బర్ఫీ’ చిత్ర రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఈ మూవీలో ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాటల రచయత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు ఒక హీరోగా నాగ చైతన్యను తీసుకున్నారు. ఈ సినిమా కథ పరంగా మరో హీరోను ఎంపిక చేయవలసి ఉంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా టాలీవుడ్ లో ఏ విధంగా ఆడుతుందో చూడాలి. కాగా చైతు ప్రస్తుతం మజిలీ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •