‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ తీయబోయే సినిమాపై ఆసక్తి పెరిగింది. కాగా త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా టైం పడుతుందట.

ప్రస్తతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న సమయం కన్నా చాలా ఆలస్యం అవుతుంది. వచ్చే 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కావున ఆ సినిమా అగ్రిమెంట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యే వరకు మరో సినిమాలో ఎన్టీఆర్ నటించకూడదు. అందువల్ల త్రివిక్రమ్ సినిమా బాగా లేట్ అవుతుందని సమాచారంగా ఉంది.

ఇక ఈ లోపు నాగ చైతన్యతో ఓ మూవీని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. వాస్తవానికి గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావలసి ఉంది కానీ కుదరలేదు. ఇప్పడు ‘అఆ’ సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను త్వరగా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇక హారిక-హాసిని బ్యానేర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమాపై త్వరలోనే అధికార ప్రకటన చేయబోతున్నారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •