అక్కినేని నాగ చైతన్య జెట్ స్పీడు తో సినిమాలు చేస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చైతూకి ‘మజిలీ’ సినిమాతో హిట్ లభించింది. ఇప్పుడు తాజాగా చైతు.. తన మేనమామ వెంకటేష్ తో కలసి ‘వెంకిమామ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు చైతు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. చైతూతో ఓ భారీ సినిమా తీయనున్నాడట. ‘బడాయి హో’ అనే బాలీవుడ్ సినిమాను రీమేక్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దిల్ రాజు కొన్నాడు. మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో వేచి చూడాలి. కాగా ఈ సినిమాతో పాటు చైతు RX 100 అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియచేస్తారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •