నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్ ఈరోజు విడుదల చేశారు. అమిగోస్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో 19వ సినిమా కావడం విశేషం. ఈనెల 23న నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో ఆ రోజు సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియచేస్తామని చిత్ర యూనిట్ తెలియచేసింది. ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ లో నాగచైతన్య చాల జాయ్ ఫుల్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే యూత్ మెచ్చే అంశాలతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కనపడుతుంది.

ఈ సినిమాలో నాగచైతన్య పక్క తెలంగాణ బాషా మాట్లాడతాడని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల గత చిత్రం “ఫిదా”లో హీరోయిన్ సాయి పల్లవి చేత తెలంగాణ యాస మాట్లాడిస్తే, ఈ సినిమాలో హీరో నాగచైతన్య చేత తెలంగాణ యాసలో మాట్లాడిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నాగచైతన్య, అతని మేనమామ హీరో వెంకటేష్ మొదటి సారి ఇద్దరు కలసి “వెంకీ మామ” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల డిసెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతుంది.