నాగ శౌర్య ఎన్నో ఆశలు పెట్టుకొని అతడు అందించిన కథతో “అశ్వద్ధామ” అనే సినిమా వారి సొంత బ్యానేర్ లోనే రూపొందింది. ఈ సినిమా జరిగే సమయంలో నాగ శౌర్య కాలికి గాయం కావడం కూడా జరిగింది. దానిని కూడా లెక్కచేయకుండా కథపై నమ్మకంతో సినిమాను నిర్మిస్తే సినిమా మాత్రం డివైడ్ టాక్ రావడంతో నష్టాలు చవిచూసినట్లు తెలుస్తుంది.

నాగ శౌర్య తన బ్యానేర్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించడం జరిగింది. మొదటగా వచ్చిన “చలో” సినిమా సూపర్ హిట్ గ నిలవడంతో పాటు రెండింతల ప్రాఫిట్ రావడంతో అదే ఉత్సాహంతో “నర్తనశాల” సినిమా నిర్మించడంతో అది ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇప్పుడు మూడవ సినిమా “అశ్వద్ధామ” కూడా అలాంటి ఫలితాన్నే ఇవ్వడంతో నాన్ని రోజులు తన బ్యానేర్ లో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా అతడు బయట నిర్మాతల సినిమాలను ఆమోదిస్తున్నాడు. అతడు సితార ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో నిర్మించబోయే సినిమాల్లో సంతకాలు చేసాడు. తన బ్యానేర్ లో సినిమాలు నిర్మించి వరుసగా రెండు ప్లాప్ లు రావడంతో రూటు మార్చి కొన్ని రోజులు బయట సినిమాలు చేసి తరువాత సొంత ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. “అశ్వద్ధామ” సినిమా విడుదలకు ముందు రాబోయే రోజులలో తమ బ్యానేర్ లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని చెప్పినా “అశ్వద్ధామ” సినిమా తరువాత ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.