నందమూరి బాలకృష్ణ లాక్ డౌన్ సమయంలో అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా మాయమైపోయారు. తనను గెలిపించిన హిందుపూర్ నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి ఎంచక్కా హైదరాబాద్ తన ఇంట్లో సేదతీరినట్లున్నారు. ఇక ఈరోజు మహానాడు కావడంతో ప్రత్యక్షమై తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ సమయంలో తనకు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తనకు తెలియదని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఇంట్లో జరిగిన సినీ ప్రముఖుల సమావేశం రియల్ ఎస్టేట్ వ్యాపారమంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం కాస్త ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారాయి

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ చిరంజీవి ఇంట్లో జరిగిన సినీ ప్రముఖుల భేటీని రియల్ ఎస్టేట్ వ్యాపారమనడం కరెక్ట్ కాదని, బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో సినీ పరిశ్రమనే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారని పేర్కొన్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని ప్రభుత్వం, సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పలని డిమాండ్ చేశారు. నాగబాబు వ్యాఖ్యలతో మరొకసారి చిరంజీవి – బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కరోనాపై సినిమా, 40 శాతం షూటింగ్ పూర్తి

చంద్రబాబు వైఖరి ఎలాంటిదో దేవినేని నెహ్రు ఎప్పుడో బయటపెట్టాడు.