నాగబాబు గత రెండు నెలలుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అతడి కోడి మెదడులో ఏవో చిన్న చిన్న లోపాలు కొటొచ్చినట్లు అతడి ట్వీట్స్ చూస్తుంటే తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ట్వీట్ పెడుతూ గాడ్సేను పొగుడుతూ గాంధీజీని కించపరిచేలా మాట్లాడటంతో అతడిపై నెటిజన్స్ ఫైర్ కావడంతో అతడు తన మాటలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పాడు.

ఇక ఇప్పుడు కొత్తగా మరొక ట్వీట్ వేస్తూ “Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.” అంటూ చేసిన ట్వీట్ మరొకసారి పెద్ద వైరల్ గా మారడమే కాకుండా అతడితో నెటిజన్స్ ఫుట్ బాల్ ఆడుతున్నారు.

ఇప్పటి వరకు ముప్పైఆరు పార్టీలతో జత కట్టిన జనసేన పార్టీ ఇప్పుడు కొత్తగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతుంది. గాడ్సే జయంతి రోజు బీజేపీ నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుల కళ్ళలో అందం చూడాలన్న తపనతో గాడ్సేను పొగిడి రివర్స్ పంచ్ లు వేయించుకున్న నాగబాబు ఇప్పుడు వాజపేయి ఫోటో కరెన్సీ నోట్ల మీద వేయాలని చెప్పి బీజేపీ పార్టీకి ఎంతలా దాసోహమయ్యారో చెప్పకనే చెబుతున్నారు. అసలు వాజపేయి, పివి నరసింహారావు సమరయోధులు కాదు, ప్రజలు వారికిచ్చిన బాధ్యతలను నిర్వహించిన గొప్ప నేతలు. వారిని మనం ఎప్పటికప్పుడు కీర్తించుకుంటూనే ఉన్నాం.

ఇక సావర్కర్ అనే అతడు భారతదేశంలో ఎంతో మంది నాయకులు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటిష్ వారికి చెంచాగిరి చేసాడని చరిత్ర చెబుతుంది. అలాంటి సావర్కర్ బొమ్మ వేయాలని కోరావంటే… రేపో మాపో మా తమ్ముడు పవన్ కళ్యణ్ ఫోటో కూడా కరెన్సీ నోట్ల మీద వేయాలని డిమాండ్ చేసినా చేస్తావు. ఇక ఈసారి నాగబాబు తన ట్విట్టర్ లో గొప్ప దేశభక్తుడిగా స్వాతంత్య్రం కోసం పోరాడాడని భజన కొట్టిన నాధూరాం గాడ్సే పేరు మర్చిపోవడమే అతడి పోస్టులో ఉన్న చిన్న లోటు.

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారి జాబితా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వారితో పోరాడి అమరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి మొదలుపెడితే ఎందరో మహానుభావులు భారతదేశం కోసం కృషి చేశారు. కానీ మన దేశంలో 10, 20, 50, 100, 200, 500,2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంత మంది బొమ్మలని వాటి మీద లిఖిస్తారు. మనకున్న వాక్ స్వాతంత్య్రంలో ఒకరి పేరు కరెన్సీ నోటు మీద ఉంచి, మరొకరి పేరు లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికే రాజ్యాంగం వ్యవస్థలో బతుకుతున్నాం. కానీ నీ కోడి మెదడుకు ఇవన్ని అర్ధమయ్యే ఛాన్స్ లేదు. అందుకే నీ ఇష్టమొచ్చినట్లు ఏది పడితే అది ట్వీట్ వేసి నెటిజన్స్ చేత తిట్లు తింటూ ఈ లాక్ డౌన్ సమయంలో కాలం గడిపేస్తున్నావ్.

ప్రపంచం మొత్తం జ్యోతి కుమారి గురించే చర్చ, ఆమె చేసిన సాహసం ఒక చరిత్రాత్మకం

ఇప్పటికైనా గురూజీని వదిలేయండి సామి, ఇక మీదట అలా చేయడులే

ఒక పచ్చ మీడియా జగన్ సర్కార్ గురించి పెట్టిన పోల్ తీసేయడానికి కారణం?