“శంకర్ దాదా జిందాబాద్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి… గాంధీజీ గొప్పతనం గురించి ఎంతలా చెప్పాడో ఆ సినిమా చూసినవారికి తెలుస్తుంది. గాంధీజీ జీవితం ప్రతిఒక్కరికి ఆదర్శమే. చిన్న రక్తం బొట్టు కిందపడకుండా స్వాతంత్య్రం సాధించాలని కళలుకని ఆ దిశగా తన కళను సాకారం చేసుకున్న గొప్ప నేత, అందుకే ఆయనను జాతిపితగా గుర్తించారు. అలాంటి గాంధీజీని గాడ్సే అనే దుర్మార్గుడు అత్యంత దారుణంగా మట్టుబెట్టాడు.

ఈరోజు గాడ్సే జయంతి… ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీతో పాటు, సమాజానికి ఎలాంటి ఉపయోగంలేని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు గాడ్సే గొప్ప దేశభక్తుడట. అతడు దేశానికి ఎన్నో సేవలు చేసాడట, అతడు గాంధీజీని చంపడం తప్పుకాదనట్లు ఈ సోకాల్డ్ నాగబాబు మాట్లాడుతుంటే కొంతమంది మెగాభిమానులు మాత్రం నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మత్తు డాక్టర్ సుధాకర్ ఏమైనా పూనాడా ఏమిటి? తప్పతాగి రోడ్డుపైన బట్టలిప్పదీసుకొని సుధాకర్ వైద్య వృత్తికే అపవాదు తెచ్చినట్లు నాగబాబు కూడా ఏమైనా ఆ జాబితాలో చేర్చాలా అని సందేహిస్తున్నారు.

ఇక మరికొంత మందైతే మా నాగబాబు ఏది చెబితే అదే కరెక్ట్… అంటూ నాగబాబుకు జై కొడుతున్నారు. ఈరోజు నాగబాబు వ్యవహరించిన తీరుతో జనసేన పార్టీలో ముఖ్యనేతగా అతడు గాడ్సే గురించి స్పందించిన తీరుతో ఇక నుంచి గాంధీ జయంతి, వర్ధంతికి ఎటువంటి దణ్ణాలు… దస్కాలు.. దండాలు గాంధీజీకి వేయవలసిన అవసరం లేదని మనమంతా గాడ్సే అభిమానులమని చెప్పకనే చెప్పేసారు.

అసలు నాగబాబుకి ఇన్నేళ్ల తన జీవిత కాలంలో గాడ్సే గొప్పవాడు అని ఎప్పుడు తెలియలేదనుకుంటా. కొత్తగా ఎప్పుడైతే బీజేపీ సంకెక్కి రాజకీయం చేయడం మొదలు పెట్టారో వారి ప్రాపకం కోసం గాడ్సేను బుజాల మీద మోయడానికి సిద్ధమయ్యారు. నాగబాబు మోసినట్లు ఎప్పుడు బీజేపీ నాయకులు కూడా గాడ్సే గొప్పవాడని చెప్పలేదు… రాబోయే రోజులలో కూడా చెప్పే అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు బీజేపీ పార్టీకి ఎంత భజన చేస్తున్నా బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోకపోవడంతో ఏకంగా గాడ్సేనే గొప్ప నేతగా భావించి మరింత వారికి దగ్గర కావాలన్నా అతడి ఆతృతను చూస్తుంటే సిగ్గేస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కష్టాన్ని నమ్ముకొని పైకి వస్తే అతడి తమ్ములిద్దరు చిరంజీవి పేరు చెప్పుకొని పైకెదిగి ఇప్పుడు అతడి పేరుని చెడకొట్టడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ వ్యాఖ్యానాలు చూస్తుంటే నాగబాబు పౌడర్ గట్రా లాంటివి వేసుకొని ఏమి ట్వీట్ చేయలేదు కదా అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి వారు మన సబ్యసమాజానికి ఎంతో ప్రమాదకరం. ఇలాంటివారిపై ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ స్పందిస్తూ “నీ కోడి మెదడుకి ఇంతకన్నా తెలివి అవగాహన ఎక్కడ వస్తాయిలే నాగబాబూ! తమ్ముడు బీజేపీ గాలి పిలిస్తే, వాళ్ళ తుమ్ముల్ని పీల్చేరకంగా నువ్వు తయారయ్యావ్…నీ జీవితం ధన్యం పో!!!” అంటూ పోస్ట్ చేశారు.

రేపిస్టులను సానుభూతితో చూసే దేశంలో డాక్టర్ సుధాకర్ పట్ల అలా వ్యవహరించడంలో తప్పు లేదులే

దిక్కుమాలిన టిక్ టాక్ ఇద్దరిని బలిగొంది

నా బలం కలెక్టర్లు, ఎస్పీలే అంటూ సీఎం జగన్ పొగడ్తలు