టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే అనేకమంది నటులు కరోనా భారిన పడగా, ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్న నాగబాబుకు పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక నాగబాబు ప్రముఖ ఛానల్లో ఓ షో నిర్వహిస్తున్నారు. ఆ షూట్ సమయంలోనే అతనికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే అనేక మంది తెలుగు టీవీ తారలు షూటింగుల్లో పాల్గొనడం వల్ల కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ పలు టీవీ షోలు, సీరియళ్లు ఆగిపోయాయి.

ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..!

‘సర్కారు వారి పాట’కు భారీగా డిమాండ్..!