మే 22, మే 23 తేదీలను ఎప్పటికి మరిచిపోలేను అన్నారు అక్కినేని నాగార్జున. ఇక ఈ తేదీలపై వివరణ ఇచ్చిన నాగార్జున.. మే 22న ‘అన్నమయ్య’, మే 23న ‘మనం’ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ నిలిచాయి అని చెప్పారు. ఆ రెండు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన సంగతి తెలిసిందే. ఇక అన్నమయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నాగార్జునను మరో కోణంలో చూపించింది. సాక్షాత్తు అన్నమయ్యే దిగివచ్చాడా అనేలా నాగార్జున పాత్రలో లీనమై నటించారు.

ఇక ఈ రెండు సినిమాలు మంచి క్లాసిక్ అన్న నాగార్జున.. అన్నమయ్య, మనం చిత్రాల దర్శకులైన రాఘవేంద్రరావు. విక్రమ్ కుమార్ లకు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలియచేశారు.

nagarjuna twitter