కింగ్ నాగార్జున నటించిన ‘మన్మధుడు-2’ సినిమా ఆగష్టు 9న విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహించాడు. గత సంవత్సరం సుశాంత్ హీరోగా వచ్చిన ‘చి లా సౌ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు రాహుల్. ఆ సినిమా హిట్ అవ్వడంతో నాగార్జునని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

కాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ వినూత్నరీతీలో చేశారు నాగార్జున. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రతో ప్రాంక్ వీడియో చేసిన నాగార్జున.. అతనితో కొద్ది సేపు ఆడుకున్నారు. తనకి ఇష్టమైన ఫుడ్ కోసం ఓ రెస్టారెంట్ కి రాహుల్ ని పంపిన నాగ్.. అక్కడ మరొక కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తినమని.. పరిచయం లేని అమ్మాయితో మాట్లాడమని.. వెయిటర్ తో గడవ పెట్టుకోమని వింత వింత పనులు చేయించాడు. ఈ విధంగా సినిమా ప్రచారం కోసం నాగార్జున వైవిధ్యమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక అన్నపూర్ణ స్టూడియో, ఆనంది ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

nag raahul
  •  
  •  
  •  
  •  
  •  
  •