ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలన్ని వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ‘ఊపిరి’ సినిమా తరవాత ఆయన నటించిన సినిమాలన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఊపిరి సినిమా తరువాత నాగార్జున ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోలేదు. ఫలితంగా ఈ సినిమా ఫ్లాఫ్ అయ్యింది.

నమో వెంకటేశాయ తర్వాత ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది 2 లో నటించాడు నాగార్జున. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ సినిమాగా మిగిలింది. ఎప్పుడో శివ లాంటి హిట్ ఇచ్చాడన్న కారణంతో వరుసగా ప్లాపులలో ఉన్న రామ్ గోపాల్ వర్మకి ఆఫిసర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయింది కూడా తెలియదు. ఈ సినిమా కోటి రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసి నాగార్జున పరువు తీసింది.

ఇక గత సంవత్సరం నానితో కలసి నాగార్జున నటించిన చిత్రం దేవదాస్. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా నిలబడలేకపోయింది. ఇప్పుడు నాగార్జున తాజాగా విడుదలైన సినిమా మన్మధుడు 2. భారీ అంచనాలతో మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది.

మన్మధుడు వంటి క్లాసిక్ సినిమాను నాగార్జున చెడ కొట్టాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేక మరో ప్లాప్ ను నాగార్జున ఖాతాలో వేసింది. ఇలా వరుసగా డబల్ హ్యాట్రిక్ ప్లాపులను కొట్టాడు నాగార్జున. ఇక తెలుగులో బిగ్ బాస్ షో తర్వాత నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సీక్వెల్ లో నటిస్తాడని సమాచారం. ఈ సినిమా అయినా నాగార్జునకి హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •