అక్కినేని అఖిల్ తాజా సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అఖిల్ కి బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకం కానుంది. అయితే ఈ సినిమా మీద నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నాడు. కాగా ఈ సినిమా ఎలా వచ్చిందోనని నాగార్జున ఔట్ ఫుట్ తెప్పించుకుని సినిమా మొత్తాన్ని చూసారని.. అవుట్ ఫుట్ పై నాగ్ చాలా సంతృప్తి వ్యక్తం చేసాడట.

ఇక కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చే ఏడాదికి మారనుంది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 సంస్థపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఇది అఖిల్ కి ఐదవ సినిమా కాగా, సురేందర్ రెడ్డికి పదవ సినిమా. ఈ సినిమాకు రష్మిక లక్ కూడా కలసి వచ్చేలా ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కథ స్పై ద్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది.

సెట్స్ లో కుప్పకూలి నటుడి మృతి..!

పవన్ కళ్యాణ్ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్..!

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్..?