‘ఫిదా’ సినిమా తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ను వాయిదా వేశారు. ఇక ‘ఫిదా’ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బారి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల స్టార్ హీరో నాగార్జునతో సినిమా తీయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా శేఖర్ కమ్ముల స్టైల్ లోనే ఉండబోతుంది. ప్రస్తుతం నాగార్జున కొత్త దర్శకుడు సోలొమాన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ మీదకు వెళ్తుందంటున్నారు. ఇక ఈ సినిమాను కూడా ‘లవ్ స్టోరీ’ నిర్మాతలయిన నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్నారు.

విద్యార్థుల తరుపున డిగ్రీ పట్టాలు అందుకున్న రోబోలు

రాజ్యసభ సభ్యుడు అరెస్ట్.. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలింపు..!