నాగార్జున హీరోగా రాబోతున్న “మన్మధుడు-2” సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ అప్పట్లో “మన్మధుడు” సినిమా దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ అద్భుతమైన సంభాషణలు అందించాడని చెప్పి క్రెడిట్ మొత్తం విజయ్ భాస్కర్ కు ఇచ్చి… త్రివిక్రమ్ పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు. అసలు ఆ సినిమాకు సంభాషణలు ఇచ్చిందే త్రివిక్రమ్… కానీ నాగార్జున ఇలా ఎందుకు చెప్పాడా అని సోషల్ మీడియాలో త్రివిక్రమ్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేయగా నాగార్జున క్లారిటీ ఇస్తూ… అప్పట్లో తనకు సినిమా కథ చెప్పేటప్పుడు మాటలు కూడా విజయ్ భాస్కర్ చెప్పాడని చెప్పి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూసాడు.

కానీ నాగార్జున అలా మాట్లాడటానికి త్రివిక్రమ్ తో వచ్చిన పొరపొచ్చలే కారణమని తెలుస్తుంది. అఖిల్ కు హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో అఖిల్ తో ఒక సినిమా తీయమని నాగార్జున… త్రివిక్రమ్ ను అడగటం జరిగిందట. త్రివిక్రమ్ మొదట చేస్తానని చెప్పి తరువాత అఖిల్ తో సినిమా గురించి సరిగ్గా స్పందించకపోవడంతోనే నాగార్జున అక్కినేని ఇలా మాట్లాడాడని గుస గుసలు వినపడుతున్నాయి. ఈ గొడవతో ఇప్పుడు నాగార్జున అభిమానులు సినిమాపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సరసన “మన్మధుడు-2” సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా… రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సమంత ప్రత్యేక పాత్రలో మెరవనునట్లు తెలుస్తుంది.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •