అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌లతో సందడి చేస్తున్న సవ్యసాచి టీం తాజాగా సాంగ్‌ టీజర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ పాటను రీమిక్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట వీడియో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. పూర్తి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతి నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్‌. కాగా ఈ సినిమా నవంబర్ 2 న విడుదలకానుంది.