బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని ముంబైలో తన నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయట పడడంతో దీనిపై ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురి హీరోయిన్ల పేర్లు బయటకి రావడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఎన్సీబీ అధికారుల తీరుపై నటి , కాంగ్రెస్ నేత నగ్మా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేవలం వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు జారీచేశారని.. మరి బహిరంగంగా డ్రగ్స్ తీసుకున్నానన్న కంగనా రనౌత్ కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నగ్మా ప్రశ్నించారు. డ్రగ్స్ కు సంబంధించి సెలెబ్రిటీల సమాచారాన్ని మీడియాకు అందచేసి ప్రజల్లో వారి పరువు తీయడమే ఎన్సీబీ అధికారుల ఉద్యోగమా ? అని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా విచారకరమైన విషయమని.. ఈ విధంగా చేయడం ఎన్సీబీ అధికారులకు మంచి పద్దతి కాదన్నారు నగ్మా.

విజయకాంత్ కు సోకిన కరోనా.. ఆస్పత్రిలో చేరిక..!

తిరుమలలో ఇద్దరు ముఖ్యమంత్రులు..!

పొలిటికల్ ఎంట్రీపై ఆర్.నారాయణమూర్తి క్లారిటీ..!