రాజకీయాలలో సీఎం వైఎస్ జగన్ చాలా కొత్తగా కనపడుతుంటాడు. అతడి రాజకీయ మొదటి నుంచి ముళ్లపైనే నడుస్తూ వస్తుంది. రాజులా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని వేల కోట్ల రూపాయలను సంపదను అనుభవిస్తూ జాతీయ పార్టీలకు దాసోహమవుతూ ముందుకు పోకుండా విలువలతో కూడిన రాజకీయాలంటూ ఇబ్బందులకు గురవుతూనే ఉన్నాడు. గత పదేళ్లుగా అతడు పడిన కష్టాలకు ఇప్పుడు అతడు బారి మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు.

కానీ గత పదేళ్లుగా ఏవైనా కష్టాలను అనుభవిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో వాటిని తునాతునకలు చేసేస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి ఎన్డీఏ పార్టీలో చేరితో కష్టాలన్నీ తీరి బయటపడే సదావకాశం తన ముందు ఉంది. నేరుగా ప్రధాని మోదీనే పిలిచి మూడు మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినా మొదటి నుంచి తాను నమ్మిన సిద్ధాంతంతో పాటు తమ రాష్ట్రానికి స్పెషల్ స్టస్ ఇస్తే తాను మీకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. స్పెషల్ స్టేటస్ కనుక ఇవ్వకుంటే కేంద్రంలో చేరే ప్రశ్నయే లేదని తాను అంశాల వారీగా తప్పకుండ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పారు.

ఇదే జగన్ స్థానంలో కనుక చంద్రబాబు నాయుడు ఉంటే తన కేసుల కోసం ప్రధాని మోదీ ముందు సాగిలా పడి మంత్రి పదవులను అనుభవిస్తూ పెద్ద ఎత్తున తాను కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని హడావిడి చేసేవాడు. అధికారం కోసం ఒకసారి స్పెషల్ స్టస్ అని మరోసారి స్పెషల్ స్టేటస్ వద్దని చంద్రబాబు చేసే నీచపు రాజకీయాలు జగన్ చేయకుండా కేసుల భయాన్ని పక్కన పెట్టి తాను వేస్తున్న అడుగులు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.