గత సంవత్సరం నందమూరి బాలకృష్ణ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించినా కూడా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే బాలయ్య మార్కెట్ తగ్గిన నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ను బాగా తగ్గించారట. బాలయ్యకు 10 కోట్ల రెమ్యూనరేషన్ అని చెప్పి 5 కోట్లకు తగ్గించారని తెలుస్తుంది. అలాగే బోయపాటి రెమ్యూనరేషన్ కూడా చాలా తగ్గించినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాను మొదట 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలియచేసారు. కానీ ఇప్పడు ఈ సినిమాను 40 కోట్లకు పరిమితం చేసినట్లు తెలుస్తుంది. తనకు ఈ మధ్య ఏ విధంగానూ కలసి రావడం లేదని భావిస్తున్న బాలయ్య.. జపాలు, గ్రహశాంతి చేయిస్తున్నారట. అయితే జాతకం బాగోలేదు అనుకున్నపుడల్లా ఇలా చేయడం బాలయ్యకు అలవాటే అంటున్నారు. ఈ మధ్య బాలయ్య మీద నెటిజన్లు విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన డ్రస్సుల మీద గెటప్ల మీద చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.