గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు అల్లరి నరేష్. నరేష్ చేస్తున్న తాజా ప్రయోగాత్మక సినిమా ‘నాంది’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘నాంది’ సినిమాను జి5 ఓటిటి సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తరువాత ‘నాంది’ని ఓటిటిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు నరేష్. అందుకే పోలీస్ స్టేషన్ సన్నివేశాలలో కూడా నగ్నంగా నటించడానికి అంగీకరించాడు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

గోవా ట్రిప్ లో ప్రియుడితో కలిసి నయన్ ఎంజాయ్..!

అఖిల్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున..!

పవన్ కళ్యాణ్ సినిమాకు అమెజాన్ భారీ ఆఫర్..!