నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “ఓ బేబీ” సినిమా మంచి విజయం సాధించడంతో సమంత మంచి ఖుషి ఖుషీగా ఉంది. నందిని రెడ్డి మేకింగ్ పట్ల సమంత ఫిదా అయిపోయిందట. ఇదే ఊపులో నందిని రెడ్డి కూడా సమంతకు మంచి థ్రిల్లర్ స్టోరీ చెప్పడంతో సమంతకు నచ్చి ఫుల్ స్క్రిప్ట్ వినిపించమని కోరిందట.

ఇక నందినిరెడ్డి ఫుల్ స్క్రిప్ట్ తో సమంతను ఫిదా చేసి… మరోసారి సమంతతో కలసి వర్క్ చేయాలని ఉత్సాహంతో ఉంది. “అలా మొదలయింది” సినిమాతో ఇండస్ట్రీలో తన జర్నీ మొదలుపెట్టిన నందిని రెడ్డి తరువాత వచ్చిన ఒకటి, రెండు సినిమాలు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడింది. మరలా తిరిగి “ఓ బేబీ” సినిమాతో తన సత్తా చాటుకొని సూపర్ లేడీ డైరెక్టర్ గా మరో సారి ఇండస్ట్రీలో తన పేరు వినిపించేలా చేసుకోవడంలో సక్సెస్ అయింది.
  •  
  •  
  •  
  •  
  •  
  •