ఎన్నికల వేళ ఇద్దరు కొత్తవారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు బారి స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. కిడారి సర్వేశ్వరరావు కొడుకుకి మంత్రి పదవి ఇచ్చి గిరిజన ప్రాంతాలలో పట్టు కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక నంద్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఫరూక్ ను మంత్రి వర్గంలోకి తీసుకొని మైనారిటీలకు తగు ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికలలో నంద్యాలలో భూమా కుటుంబానికి చెక్ చెప్పి ఫరూక్ ను ఎమ్మెల్యేగా నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు కనపడుతున్నాయి.

భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత జరిగిన ఉపఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డిని  ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలలో గెలవడానికి వందల కోట్లు డబ్బు ఖర్చు పెట్టిన సంగతి అందరకి తెలిసిన విషయమే. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికలలో ఉండదని అక్కడ శిల్ప కుటుంబం ఎంతో బలమైనది కావడంతో భూమా బ్రహ్మానంద రెడ్డిని టిడిపి అభ్యర్థిగా నిలబెట్టి నంద్యాలను వచ్చే ఎన్నికలలో చేజిక్కించుకోవడం కష్టమన్న బావనలోకి వచ్చి… ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు… ఒక వైపున మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటుతో పాటు నంద్యాల పట్టణంలో ఉన్న ముస్లిం ఓట్లన్నీ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకే పడేలా వ్యూహరచన చేసినట్లు కనపడుతుంది.

NMD Farooq

ఫరూక్ కూడా గత ఉపఎన్నికలలోనే తనకు నంద్యాల టికెట్ కోసం ప్రయత్నాలు చేసారు. కాని సెంటిమెంట్ వర్క్ అవుట్ చేయడానికి చంద్రబాబు అప్పట్లో  భూమా కుటుంబానికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినా ఈసారి ఆ పరిస్థితి అలా ఉండదని అంటున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఉన్న ముస్లిం ఓట్లను చేజిక్కించుకునేందుకు ఫరూక్ కు అప్పటికప్పుడు ఎమ్మెల్సీ కట్టబెట్టారు.

మంత్రి అఖిల ప్రియ మీద కూడా చంద్రబాబు నాయుడు కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అఖిల ప్రియ… టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డిని కలుపుకొని పోకపోవడంతో కూడా చంద్రబాబుకి ఆగ్రహం తెప్పించింది. కొంత మంది తెలుగుదేశంలో భూమా వ్యతిరేక వర్గం వారు కూడా వచ్చే ఎన్నికలలో అఖిల ప్రియకు ఆళ్లగడ్డ టికెట్ కూడా కష్టమని అంటున్నారంటే, భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత భూమా ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఈ పరిణామాలతో భూమా అఖిల ప్రియ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. గతంలోనే ఒకసారి భూమా కుటుంబం వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తరువాత ఆ విషయాన్ని అఖిల ప్రియ కండించిన విషయం తెలిసిందే.