హీరో నానికి వరుస పెట్టి జరక్ లు తగులుతున్నాయి. అతడు హీరోగా ఈ ఏడాది వేసవిలో విడుదలైన ‘జెర్సీ’ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కినా ఆ సినిమా బయ్యర్లకు చెప్పుకోతగ్గ లాబాలైతే రాలేదు గాని బొటా బొటిగా బయటపడ్డారు. ఇక గత వారం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు రివ్యూ లు అన్ని ప్లాప్ అని తేల్చగా మొదటి నాలుగు రోజులు మాత్రం మంచి పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది.

ఇక మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సినిమాకు మొదటి వారాంతరంలోనే లాభాలను చవిచూడవచ్చని అనుకున్నారు. కానీ మంగళవారం నుంచి సినిమాకు ఆశించినత ఫలితం ఇవ్వకపోగా దాదాపుగా 70 శాతం ఆక్యుపెన్సీ పడిపోవడంతో బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. అసలు ముందుగా ఈ సినిమా కథను విక్రమ్ కే కుమార్.. అల్లు అర్జున్ కు చెప్పాడు.

అల్లు అర్జున్ కథలో మార్పులు చెప్పడంతో పాటు సెకండ్ హాఫ్ లో మార్పులు చేయమని చెప్పడం, వెంటనే అల్లువారి కాంపౌండ్ లో వర్క్ ఔట్ అవ్వకపోవడంతో అదే కథను నానికి చెప్పి ఒకే చేయించుకొని సినిమాను తీశారు. కానీ అల్లు అర్జున్ అప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. గ్యాంగ్ లీడర్’ సినిమాకు కూడా క్లైమాక్స్ పెద్ద మైనస్ అని అందరూ సినిమా చూసిన తరువాత చెప్పుకొచ్చారు. సినిమాలో మంచి కామెడీతో పాటు, కాస్త థ్రిల్ కలిగించినా క్లైమాక్స్ తో సినిమా తేలిపోయింది.

గత ఏడాది నాని ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాను ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ దర్శకుడు ముందుగా రామ్ చరణ్ కు చెప్పాడట. కానీ రామ్ చరణ్ సినిమాను తిరస్కరించడంతో నాని దగ్గరకు రావడం, నాని ఆ సినిమాను చేయడం… ప్లాప్ టాక్ మూటగట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. వేరే హీరోలు తిరస్కరించిన కథలు నాని దగ్గరకు రావడం, వాటిని నాని టేక్ అప్ చేసి హిట్ గా మలచాలనుకోవడంతో బోల్తాపడుతున్నాడు. నానికి ఈమధ్య కాలంలో అతడి స్టామినాకు తగ్గ హిట్ చిత్రమైతే రాలేదు. ఒకవైపున యంగ్ హీరోస్ దూసుకొస్తున్న వేళ నానికి అర్జెంటు గా ఒక సూపర్ హిట్ సినిమా పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.