దళితులను కించపరచడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముందు వరుసలోనే ఉంటుంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “దళితులలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని” వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం కలిగించాయి. దానిపై తెలుగుదేశం నాయకులూ ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక కిందా మీద పడేవారు.

ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో “చలో ఆత్మకూరు” వెళ్లాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నసమయంలో అక్కడే ఉన్న మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అక్కడే ఉన్న మహిళా ఎసైను దోసించినట్లు వార్తలు కలకలం రేగాయి. నన్నపనేని రాజకుమారి ఆగ్రహంగా “దళితుల వల్లే ఈ దరిద్రం” అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అక్కడే ఉన్న మహిళా ఎసై నన్నపనేని రాజకుమారిని కడిగిపారేయడం కూడా చూశాము.

మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఉండి దళిత మహిళను ఉద్దేశించి మీరు అన్న వ్యాఖ్యలు దారుణమని, తాను కస్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని, మీలా తాను అడ్డదారిలో రాలేదని మాట్లాడుతుండటంతో తెలుగుదేశం నాయకులు సర్ది చెప్పే పని చేశారు. ఇక ఆ ఎసై అక్కడ నుంచి ఆవేదనతో విధుల నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఆ మహిళా ఎసై ఇప్పుడు నన్నపనేని వ్యాఖ్యల పట్ల కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓట్లు వేయించుకునేటప్పుడు మాత్రం దళితులు కావాలి, ఇక తరువాత పాలించే ఐదేళ్లు వారిని ఎంత హీనంగా చూస్తున్నారో ఈరోజు నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలే నిదర్శనం. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుని అప్పట్లోనే దళితులు తీవ్రంగా హెచ్చరించినట్లైతే ఈరోజు నన్నపనేని లాంటి నేతలు దళితుల గురించి మాట్లాడే సాహసం చేసేవారు కాదు. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఎలా నన్నపనేని విషయంలో సర్దిచెప్పుకుంటారో చూడాలి.

దళితులని కూడా చూడకుండా పల్నాడు నుంచి వైసీపీ వారు తరిమేస్తున్నారని తెలుగుదేశం నేతలు లేనిపోనీ అబాండాలు వేయబోతే… ఈరోజు అదే దళితులను కించపరిచేలా నన్నపనేని మాట్లాడటంతో… రాజకీయం కోసం దళితులను అడ్డుపెట్టుకొని వైసీపీ పార్టీని బద్నామ్ చేయాలని చూస్తున్నట్లు బట్టబయలైంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీలోని దళితులు రాజకీయంగా అమనల్ని ఎప్పటికైనా వాడుకోవడమే తప్ప తెలుగుదేశం పార్టీలో అందలం ఎక్కించే పరిస్థితి లేదని గుసగుసలాడుకుంటున్నారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •