మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, బాలకృష్ణ నందమూరి కూతురు నారా బ్రాహ్మణి తన కొడుకుతో కలసి ఈరోజు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి… లక్డికాపూల్ వరకు ప్రయాణం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక నెటిజెన్ అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. గతంలో హీరో నితిన్ కూడా హైదరాబాద్ లో బాగా వర్షం పడటంతో ట్రాఫిక్ కష్టాల నుంచి బయట పడేందుకు మెట్రోలో ప్రయాణం చేసాడు.

అప్పుడప్పుడు కొంతమంది తారలు హైదరాబాద్ అందాలను వీక్షించడానికి మెట్రో జర్నీ చేస్తుంటారు. నారా బ్రాహ్మణి మెట్రోలో ప్రయాణం చేయడంతో తెలుగుదేశం శ్రేణులు వీడియోను తెగ షేర్స్ చేస్తున్నారు. తన భర్త నారా లోకేష్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థను చూసుకుంటుంది. ఉండవల్లి కరకట్ట మీద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో నివాసముంటున్న నారా కుటుంబం మొన్న వరదల తాకిడికి కుటుంబమంతా హైదరాబాద్ వచ్చేసారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •