మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ బాబు… ఇప్పుడు తీరిగ్గా ఇంట్లో కూర్చుని ట్విట్టర్ సాక్షిగా సీఎం జగన్ కు సలహాలు ఇస్తున్నాడు. రాష్ట్రం గత ఐదేళ్లలో ఎలా అభివృద్ధి చెందిందో, పెట్టుబడి దారుల దగ్గర ఎలాంటి భజన చేస్తే పెట్టుబడులు వస్తాయో చెబుతున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పమని మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు…సీఎం జగన్ కు సలహా ఇస్తున్నాడా అనిపిస్తుంది.

ముందుగా సీఎం జగన్ ఏపీని పేద రాష్ట్రమని అనడాన్ని లోకేష్ బాబు తట్టుకోలేకపోతున్నారట. చంద్రబాబు గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధికి దాదాపుగా 700 అవార్డులు వచ్చాయట. అవి అన్ని చెప్పుకోకుండా పేద రాష్ట్రమని చెబితే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ బాబు చెప్పినట్లు ఆ 700 అవార్డ్స్ ఎక్కడ నుంచి కొనుకున్నారని ఎదురు ప్రశ్నిస్తారేమో అని భయపడినట్లు ఉన్నారు. లేకపోతే అన్ని అవార్డ్స్ గురించి ఏపీ ప్రభుత్వం చెప్పకుండా ఉంటుందా.

లోకేష్ చెప్పినట్లు గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని చెబితే ఉన్న పెట్టుబడులు కూడా ఊడిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన చోట నాయకులు కూడా ఇసుక కబ్జాలు, భూ కబ్జాలతో, చరిత్రలో ఎవరు చేయనంత అప్పు చేసి… రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టారు.

లోకేష్ బాబు సలహాలతోనే కాబోలు చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడల్లా… పేద రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుంటారు. ఇక పెట్టుబడుల సదస్సులో మాత్రం… ఎప్పుడు కొట్టే డబ్బాతో అలా అభివృద్ధి చేశా ఇలా అభివృద్ధి చేశా… ప్రపంచంలోనే అమరావతి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టబోతున్నా అంటు ఒకటే కొట్టుడుతో పెట్టుబడి దారుల చెవులు మూతలు పడేలా చెప్పేవారు. కానీ చంద్రబాబు అండ్ కో కబ్జాల పర్వంతో పాటు, కోట్ల రూపాయలు కమిషన్స్ పెట్టుబడి దారుల దగ్గర వసూలు చేయడానికి రావడంతో అందరూ పెట్టుబడులు పెట్టకుండానే పారిపోయారు.

కానీ సీఎం జగన్ మాత్రం ఉన్నది ఉన్నట్లు, పెట్టుబడి దారుల దగ్గర కూడా మాది పేద రాష్ట్రమని సరైన వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని పరిశ్రమలు పెట్టి తమ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించమని వేడుకుంటున్నారు. ఇక చంద్రబాబుకి గత ఐదేళ్లలో లోకేష్ బాబు సలహాలు ఇవ్వడం వలనే అనుకుంట చంద్రబాబుకు చరిత్రలో ఎన్నడూ రానటువంటి 23 సీట్లతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. అలాంటి తప్పుడు మాటలు చెప్పి జగన్ ను కూడా ఆ స్థితికి దిగజార్చాలని లోకేష్ బాబు ఏమైనా కంకణం కట్టుకున్నాడా… చూస్తుంటే అలానే ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •