నారా వారి కుటుంబం నుంచి వచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదో అలా అలా బండి లాగిస్తు ముందుకు పోతున్నాడు. ఒక సమయంలో అతడు చేసే సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించిన తరువాత రోజులలో పూర్ కథ, కథనంతో ఆకట్టుకోలేకపోయాడు. దీనితో అతడు తన నెంబర్ స్థానాన్ని దారుణంగా కోల్పోయాడు. కానీ అతడిలో మాత్రం మంచి నటుడే ఉన్నాడు. సుకుమార్ దర్వకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరో పాత్రకు సమానంగా విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంది. ముందుగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదిస్తే అతడు ఒకే చెప్పి, తమిళంలో సినిమా విడుదల చేయకూడదని కండిషన్ పెట్టాడు. అసలు తమిళంలో విడుదల చేయనప్పుడు అతడితో పనేముంది, అది యూనిట్ కు కూడా వర్క్ అవుట్ కాదు. దీనితో మరొక నటుడివైపు చూసే క్రమంలో సుకుమార్ మదిలో నారా రోహిత్ ఉన్నాడట.

దీనిపై నారా రోహిత్ ను సంప్రదించి అతడికి కథ చెబితే పిచ్చ పిచ్చగా నచ్చేసిందని టాక్. దీనితో నారా వారబ్బాయిని సుకుమార్ ఎలా విలన్ గా చూపిస్తాడన్నది ఆసక్తిగా మారింది. సుకుమార్ సినిమాలో చేసే ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అతడి సినిమాలో చేస్తే నటనతో పాటు, అతడి కెరీర్ కూడా మరో లెవల్ కు వెళ్తుందండంలో ఎలాంటి సందేహం లేదు. అసలే ఇపప్టికే రౌడీ పోలీస్ గా సబ్ జైలర్ పాత్రలో ‘అసురా” అనే సినిమాలో నారా రోహిత్ అదరగొట్టేసాడు. ఇప్పుడు ఏకంగా విలన్ రోల్ అంటే పిండి పిప్పి చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.