‘వెంకిమామ’ మూవీ తర్వాత వెంకటేష్ నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ హిట్ మూవీ ‘అసురన్‌’ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేష్ ఇద్దరు కొడుకుల తండ్రిగా నటిస్తున్న ఈ సినిమా పక్కా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు.

ఇప్పటికే వెంకటేష్, ప్రియమణి స్టిల్స్ విడుదల చేయగా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం కనిపించనున్నాడు. తాజాగా కార్తీక్ లుక్ ను విడుదల చేశారు. నారప్పలొ కార్తీక్.. మునికన్నా గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుంది. ఇక సురేష్ బాబు, కలైపులి యస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

narappa

మంచు మనోజ్ ను ఢీకొట్టబోతున్న ఎన్టీఆర్..!

నందమూరి బాలకృష్ణ సరసన అమలాపాల్..?

ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్ టాక్ ఫీచర్..!