ప్రతి ఏడాది ఆగస్ట్ 12న ఏనుగుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దక్షిణ చైనా యునాన్ రాష్ట్రంలో 20 గజరాజులకు విందు ఏర్పాటు చేసారు. దక్షిణ చైనాలోని యునాన్ రాష్ట్రంలో దాదాపుగా 20 గజరాజులు విందు ఏర్పాటు చేయడంతో 55 మీటర్ల పెద్ద బల్లపై గజ రాజులకు ఇష్టమైన పళ్ళు, కూరగాయలను ఉంచి విందుకు ఆహ్వానించారు డ్రాగన్ అధికారులు.

ఇక విందులో దాదాపుగా మూడు టన్నుల పండ్లు, కూరగాయలు వాడినట్లు తెలుస్తుంది. ఈ విందులో గజరాజులకు సంతృప్తికరంగా వారి పేరిట జరుపుకుంటున్న దినోత్సవాన్ని వారికే కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో అందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అడవులలో స్మగ్లర్ల నుంచి ఏనుగులను కాపాడుకునే దానిలో భాగంగా థాయిలాండ్ కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ప్రతి ఏడాది ఆగస్ట్ 12న ఏనుగుల దినోత్సవం జరుపుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •