టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీలో ఆయనకు చోటు దక్కింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరించబోతున్నారు.

ఇక వీరితో పాటు రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్‌ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్‌ వెంకటేశన్‌ దేవరాజన్, ‘సాయ్‌’ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్‌ సింగ్, ‘టాప్స్‌’ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్‌ కమిటీలోని ఇతర సభ్యులు.

భారత్ తరుపున సత్తాచాటిన అథ్లెట్స్, కోచ్‌‌లకి ఈ నేషనల్ అవార్డులను అందచేయనున్నారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 29న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డులను అందచేస్తారు. కానీ కరోనా నేపథ్యంలో ఆగష్టు 29 నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది.

‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడితో బాలయ్య..!

పరిపాలన రాజధానికి త్వరలో సీఎం జగన్ శంకుస్థాపన..!

సినీ ఇండస్ట్రీపై గోవా బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..!