మెగాస్టార్ తాజా సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాలో నయనతార ప్రధాన హీరోయిన్ గా చేస్తుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ నెల 20 న సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిరుతో పాటు రాంచరణ్, తమన్నా, విజయ్ సేతుపతి సుదీప్ హాజరవడం జరిగింది. కానీ మెయిన్ హీరోయిన్ అయిన నయనతార హాజరు అవ్వలేదు.

స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార మూవీ ప్రమోషన్స్ కి ఎప్పుడు దూరంగానే ఉంటున్నారు. చిరంజీవి కాదు మారే హీరో అయిన ప్రొమోషన్స్ కి రానని చెబుతుంది. మెగాస్టార్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కి నయనతార వస్తుందని చిత్ర యూనిట్ అంత భావించారు కానీ రాకుండా యూనిట్ సభ్యులకి షాక్ ఇచ్చింది. స్వయంగా చిరంజీవి, రాంచరణ్ వెళ్లి అడిగినా కానీ ప్రమోషన్ కి రానని చెప్పింది.. రేపు రీలీజ్ సమయంలో కూడా రానని తెగేసి చెప్పిందంట నయనతార. గతంలో కొన్ని సినిమాల విషయంలో కూడా ఇదే విధమైన చర్చ జరిగినా కూడా నయనతార తన తీరు మార్చుకోలేదు.

  •  
  •  
  •  
  •  
  •  
  •