రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో కస్టమర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) ఆన్ లైన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బ్యాంకు వేళలలో మాత్రమే సేవలు పని చేసేవి. కానీ రిజర్వు బ్యాంకు ఇప్పుడు ఈ సేవలను 24 గంటల పాటు అందుబాటులో ఉంచేలా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 24 గంటల ఆన్ లైన్ నెఫ్ట్ సర్వీస్ అమలులోకి రానుంది.

దేశీయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్ సిస్టం విజన్ 2021 పత్రంలో ఆర్బీఐ పేర్కొంది. ఇక మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నోట్ల రద్దుతో పాటు, కొత్త నోట్లను తీసుకు వచ్చి.. ఆన్ లైన్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ సేవలపైనే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని సూచించడంతో రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ఆన్ లైన్ నగదు బదిలీలు మరికొంత పెరిగే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •