భారత్ లో అమెజాన్ ప్రైమ్ దూసుకుపోతుంది, ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్ కు పోటీ ఇచ్చే సంస్థే కనపడటం లేదు. ఇక నాన్ ఇండియాలో అమెజాన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ చందాదారులు కూడా అధికంగా ఉంటారు. భారత్ కు వచ్చేసరికి నెట్ ఫ్లిక్స్ సంస్థ పెట్టిన రేటు ఇండియన్స్ కు గిట్టుబాటు కాకపోవడంతో పాటు మన దేశానికీ చెందిన పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా నాయిక బాషలలో సినిమాలు తక్కువగా తీసుకోవడంతో నెట్ ఫ్లిక్స్ పై అంత ఆసక్తి చూపరు.

ఇక మరోవైపున ఈమధ్యే నెట్ ఫ్లిక్స్ సంస్థ 400 రూపాయల రేంజిలో ఉంటే చందాదారులు పెరగడం లేదని, దానిని 199 రూపాయలు తగ్గించడం జరిగింది. అయినా అమెజాన్ కు అలవాటైన ప్రాణం నెట్ ఫ్లిక్స్ వైపు తొంగిచూసేలా చేయడం లేదు. దానిలో భాగంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ “Bard Of Blood” అనే ఒరిజినల్ సిరీస్ ను కొంత భాగం ఉచితంగా ఇవ్వనున్నారట. కొన్ని రోజులు అలవాటు చేసిన తరువాత నచ్చడంతో వాళ్ళే నెట్ ఫ్లిక్స్ చందాదారులుగా చేరతారని ఆలోచన కావచ్చు.

కానీ ఇలాంటివి మన దగ్గర కుదురుతాయంటారా? మన ఇండియన్ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే నెలకు 199 అనేది కాస్త ఎక్కువతో కూడుకున్నదే… అదే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏడాదికి 999 రూపాయలకు అందిస్తూ ఒకోసారి ఆఫర్ లో 500 రూపాయలకు కూడా అందిస్తూ వినియోగదారుడితో ఫ్రెండ్లీ వ్యవహారం ఉండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు.