జూపూడి ప్రభాకర్ మంచి వక్త్గానే కాకుండా, టీవీ డిబేట్స్ కు వెళ్ళినప్పుడు తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించడంలో ముందు వరుసలో ఉంటాడు. వైసీపీ పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ పార్టీని ప్రజలలోకి తీసుకొని వెళ్లడానికి తన వంతు సహాయం చేసాడు. ఇక 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీకి రామ్ రామ్ చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ను బండ బూతులు తిట్టాడు. అసలు జగన్ జీవితమ్లో సీఎం కాలేడని, చంద్రబాబు నాయుడు అంత గొప్ప మనిషి చెంతకు ఇంత లేటుగా ఎందుకు వచ్చానా అని సిగ్గు పడుతున్నానట్లు చెప్పుకొచ్చారు.

కట్ చేస్తే కొత్తగా చెప్పదేముంది… బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయనట్లు…. జగన్ అధికారంలోకి తన పార్టీని తీసుకురావడంతో పాపం కనీసం మూడు నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండలేక, వైసీపీలో ఉన్న తన పాత పరిచయాలు వాడుకొని నేరుగా జగన్ అప్పాయింట్మెంట్ తో ఎంచక్కా పార్టీలో చేరిపోయాడు. ఇక కథ అక్కడే మొదలయింది. జూపుడిని పార్టీలోకి చేర్చుకోవడంతో వైసీపీ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. మీ కోసం మేము నానా సంకలు నాకి ఉద్యోగాలను పణంగా పెట్టి అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తే తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరే సమయంలో జూపూడి ప్రభాకర్… సీఎం జగన్ ను బండ బూతులు తిట్టిన మాటలు గుర్తుకులేవా? అలాంటి నేతను వైసీపీలో చేర్చుకుంటారా?

పార్టీ కోసం ఇంతవరకు కష్టపడిన వారికి సీఎం జగన్ అప్పాయింట్మెంట్ దొరకదు గాని, పార్టీకి వెన్నుపోటు పొడిచి, మరోసారి వైసీపీ పార్టీ అధిరంలోకి రావడంతో వెన్నుపోటు పొడిచిన నాయకులకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తారా? వద్దు బాబోయ్ వద్దు… మావల్ల కాదు ఇలాంటి రాజకీయాలు మేము చూడలేమని సోషల్ మీడియాలో కొంత మంది ఇక మీకు పెద్ద నమస్కారం అని చెప్పి సోషల్ మీడియాకు సెలవులు ప్రకటిస్తున్నారు.

ఇక్కడే తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం వచ్చింది…. తమ పార్టీలో నుంచి వెళ్లినందుకు బాధపడాల్సిన అవసరం వైసీపీ కార్యకర్తలు కల్పించకుండా వారే జూపుడిని బండ బూతులు తిడుతుంటే పచ్చ మీడియాలో వాటిని మరింత పాపులర్ చేస్తూ వైసీపీ పార్టీ క్యాడర్ ను మరింత నిస్తేజంలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. “మొగుడు కొట్టినందుకు కాదు… తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఉండటంతో ఆ పార్టీ తెలుగుదేశం నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో జూపుడిని కొత్తగా తిట్టకుండా వైసీపీ వారి బూతుపురాణాన్ని షేర్ లు చేసుకుంటూ ఆనందపడిపోతున్నారు.