గత వారంలో మైహోం రామేశ్వరరావు ఇంటితో పాటు అతని ఆఫీస్ మీద ఐటీ అధికారులు దాడులు చేశారన్న వార్తలు హల్ చల్ చేసాయి. దీనికి సంబంధించి ఇంత వరకు ఐటి శాఖ ఎలాంటి కథనాలు బయటకు చెప్పకపోయినా సోషల్ మీడియా సాక్షిగా కొన్ని విస్తు గొలిపే వార్తలు బయటకు వస్తున్నాయి. 

ఐటి శాఖ జరిపిన సోదాలలో పలు కీలకమైన పాత్రలు దొరికాయని, వాటితో పాటు దాదాపుగా 200 కోట్ల రూపాయల డబ్బు కూడా దొరికిందని, ఈ డబ్బులో సగం కేసీఆర్ కుమార్తె కవితకు సంబంధించినదని… టీవీ9 పెట్టుబడులతో కూడా కవితకు వాటాలు ఉన్నాయని… దీనికి ఎలాంటి లెక్కలు లేవని తెలిసి అధికారులు అవాక్కయ్యారని… ఇలా ఎన్నో రకాల కథనాలు పుంఖాను పుంఖాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకవేళ అన్ని వందల కోట్లు నేరుగా దొరికితే అది దేశంలోనే ఒక పెద్ద సంచలనం, కానీ ఐటి శాఖ తన పని తాను ముగించుకొని వెళ్లిపోయింది. ఇన్ని రోజుల తరువాత దీనిపై వార్తలు కొంత మంది కావాలనే పుట్టిస్తున్నారని, ఈ వార్తల వెనక మాజీ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ఉన్నాడని… కావాలనే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మైహోం రామేశ్వర రావును బద్నామ్ చేయడానికి చేస్తున్న పనే అని గుసగుసలు వినపడుతున్నాయి. మీడియా ఛానల్ కు కూడా అందని వార్త సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లకు తెలిసింది అంటే ఈ కథనాలు వెనక ఎవరు ఉన్నారో ఇట్టే చెప్పేయవచ్చు.

అప్పట్లో ఇదే రవిప్రకాష్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కూడా లేనిపోని కథనాలు సృష్ట్టించడానికి టీవీ9 ను వాడుకున్నాడు. వైఎస్ జగన్ ఉండే లోటస్ పాండ్ ఇంట్లో బార్ ఉన్నట్లు… విదేశీ మందు కోసం ఒక పెద్ద రూమ్ నే ఉందని, లోటస్ పాండ్ ఒక పెద్ద రాజభవంతి అని ఉన్నది లేనట్లు… లేనిది ఉన్నట్లు అనేక కథనాలు పుటించారు. దీనిపై వైసీపీ నేతలు సవాలు విసిరి వచ్చి జగన్ ఇంటిని మీడియా సాక్షిగా చెక్ చేసుకోవచ్చని తెలిపితే ఒక్కరు నోరుమెదపలేదు. అలాంటి తప్పుడు కథనాలు నడిపించడంలో రవిప్రకాష్ సిద్ధ హస్తుడు. టీవీ9 సీఈఓగా ఉండి ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ అలంద మీడియాను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలనుకున్న రవిప్రకాష్ ఆటలు సాగనియ్యకుండా అడ్డుకోవడంతోనే వారిపై కక్ష కట్టి సోషల్ మీడియా వేదికను చేసుకొని మైహోం అధినేతపై ఇలాంటి కథనాలు అల్లుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  
  •  
  •  
  •  
  •  
  •  
  •