మెగా బ్రదర్ నాగబాబుకు నెటిజన్స్ సోషల్ మీడియాలో ఎంత గడ్డి పెట్టినా అతడి బుద్ధిలో మాత్రం మార్పు ఎప్పటికి కనపడదు. మూడు రోజుల క్రితం జాతిపిత మహాత్మ గాంధీజీపై పిచ్చి వాగుడు వాగి నెటిజన్స్ చేత చెప్పు దెబ్బలు తినే వరకు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు కోరుకున్నాడు. ఇక ఇంత జరిగినా అతడి బుద్ధిలో మార్పు లేకుండా ఏపీ మంత్రిపై అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్స్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

పది రోజుల క్రితం విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేదానిలో భాగంగా మంత్రులంతా ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ఐదు గ్రామాలలో పర్యటించి ఒకరోజు అక్కడే బస చేసి రాత్రి పూత నిద్రపోయి అక్కడ ప్రజలకు ధైర్యాన్ని నింపే పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఉదయాన్నే ఆ ప్రాంతంలో ఒక ఆవు దూడకు గడ్డి పెట్టపోగా అది తినకుండా పక్కకు తిరుగుతుంది. దాని గురించి నాగబాబు ఈరోజు పోస్ట్ పెడుతూ “అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను అంటూ పోస్ట్ చేసాడు.

దీనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “బుస కొట్టే ప్రతి పాము కాటువేయలేదని… నువ్వు కూడా అలాంటి వాడివేనని, కోరలు లేని నువ్వు ఎంత మాట్లాడితే వైసీపీ ప్రభుత్వానికి అంత మంచిదని… నీ కోడి మెదడుకు ఆలోచించే శక్తీ లేదని ఘాటుగా బదులిస్తున్నారు. దీనికి జనసేన కార్యకర్తలు కూడా నాగబాబు వెనకేసుకొని రాలేక కిందా మీద పడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ మీడియా కూడా జగన్ సర్కార్ పొగడ్తలతో ముంచెత్తింది. కానీ పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు మాత్రం అక్కడ ఏదో జరిగిపోతుందని మంత్రులు, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

సీఎం జగన్ కు కొత్త తరహా రాజకీయం నేర్పుతున్న ఈనాడు అండ్ చంద్రబాబు

కేజీఎఫ్ 2 వర్క్ అవుట్ కాదని తప్పుకున్న నిర్మాత