పవన్ కళ్యాణ్ కు నిజంగా ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారో… ఎవరు స్క్రిప్ట్ రాస్తే అతడు చదువుతున్నాడో తెలియదు గాని, అతడు చేసే వ్యాఖ్యలు ఒకోసారి హాస్యాస్పదంగా ఉంటాయి. తాను రెండు చోట్ల దారుణమైన పరాజయం పాలయిన అతనొక అద్భుతమైన అతీతమైన శక్తినని, ఏపీ ప్రజలను కాపాడేది తానేనని ఎన్నో మాటలు చెబుతాడు. రాజకీయ నాయుకుడన్న తరువాత ఎవరైనా అలాంటి మాటలుగాక ఇంకేమి మాట్లాడుతారు. కాసేపు ఆ మాటలను పక్కన పెడితే నిన్న గాజువాకలో తన అభిమానుల మధ్య ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే హాస్యాస్పదంగా ఉన్నాయి.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ లో హైకోర్టు పెట్టుకుంటే, పులివెందుల నుంచి కోర్టుకు
వెళ్లిరావడానికి తక్కువ ఖర్చవుతుందని వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా పంచ్ లు పడుతున్నాయి. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ తనకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారని… తాను మాట్లాడే దాని మీద ఏమైనా అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

ఒక వేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కర్నూల్ లో హైకోర్టు పెట్టినా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది. జగన్ వెళ్లే సీబీఐ కోర్టు హైదరాబాద్ లో ఉంది తప్ప కర్నూల్ లో లేదు. అసలు జగన్ ప్రతి శుక్రవారం ఏ కోర్టుకి వెళతాడు, అసలు అతడి మీద మోపబడిన కేసులు ఎక్కడ విచారణ జరుగుతున్నాయి అనే అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే అతడు నిజంగా రెండు లక్షల పుస్తకాల సంగతి తరువాత కనీసం రెండు వందల పుస్తకాలు అయినా చదివాడా అన్న అనుమానం కలుగుతుంది.

మరొక వైపున ప్రతివారం సీఎం జగన్ కోర్టుకి వెళుతున్నాడని అంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 18 స్టేలను ఎత్తేయించుకొని సచ్చిలుడిగా నిరూపించుకోమని మాత్రం అడగడు. అందుకే వైసీపీ సభ్యులు పవన్ కళ్యాణ్ ఎప్పటికి చంద్రబాబు దత్త పుత్రుడే అని కామెంట్ చేస్తుంటారు. దానిపై పవన్ కళ్యాణ్ ప్రతి సభలో తాను దత్త పుతృడిని కాదని, నిజమైన జనసేన అధ్యక్షుడినని మొర పెట్టుకుంటూనే ఉంటాడు.