దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అభిమానులు అతడిని ముద్దు ముద్దుగా గురూజీ అని పిలుస్తుంటారు. కారణం అతడు చెప్పే కవితలు… కథలు, గట్రా అలా ఉంటాయి మరి. త్రివిక్రమ్ సినిమా విడుదలైతే అబ్బా ఈ సీన్ ఏముందిరా అనుకునే సందర్భాలు అనేకం. కానీ మీరు ఏదైతే అబ్బా ఈ సీన్ అద్భుతం అని అన్నారో… అదంతా గురూజీ త్రివిక్రమ్ క్రియేటివిటీ కాదు. పక్కవాడి దగ్గర నుంచి దొబ్బేసుకొని ఇక్కడ తనది అని చెప్పుకొని డబ్బా కొట్టుకుంటున్న త్రివిక్రమ్ ను గురూజీ అనడం ఏమైనా బాగుందా?

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో #CopycatTrivikram హ్యాష్ ట్యాగ్ తో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడెప్పుడో తొట్టెంపూడి వేణు హీరోగా నటించిన “చిరునవ్వుతో” సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమెత వీర రాఘవ” సినిమా వరకు ప్రతి ఒక్కటి కాపీనే. ఈ కాపీలు మొత్తం కొరియన్ సినిమాల నుంచి లేపేయడం మన తెలుగు దర్శకులకు ఆనవాయితీగా వస్తుంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్టర్ డిగ్రీ చేసాడు. మన తెలుగు ప్రజలు ఆ కొరియన్ సినిమాలు ఎందుకు చూస్తారులే… నేను లేపేసిన సీన్స్ ఎవడు కనిపెడతాడులే అనుకోని దొంగతనంగా పట్టుకొచ్చి ఇక్కడ తన గొప్పతనమని చెప్పుకోవడంతో సోషల్ మీడియాలో సినీ అభిమానులకు చిరెత్తుకొస్తుంది.

ఏమయ్యా త్రివిక్రమ్ నువ్వు లేపేస్తే లేపేసావ్… దాని గురించి సైలెంట్ గా ఉండకుండా… తనకు ఎప్పుడు మరొక సినిమా నుంచి కాపీ కొట్టే అవసరం లేదని డబ్బు కొట్టుకోవడమే నచ్చడం లేదు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అన్ని సినిమాలలో కమెడియన్ ను ఆటలో అరటిపండు చేస్తూ కామెడీ సీన్స్ రాసుకునే త్రివిక్రమ్… ఇప్పుడు నెటిజన్స్ దెబ్బకు అతడే ఆటలో అరటిపండుగా మారిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు. కొంతమంది మాత్రం ఇక చాలులే సామి… వదిలేయండి… ఇప్పటికైనా కాపీలు చేయడం మానుకుంటాడేమో అని అంటున్నారు. అవునవును ఇప్పటి వరకు చేసిన టీజింగ్ చాలు… ఇక త్రివిక్రమ్ ను టీజ్ చేయడం ఆపేసి అతడికి కాస్త స్వేచ్ఛనివ్వండి.

ఒక పచ్చ మీడియా జగన్ సర్కార్ గురించి పెట్టిన పోల్ తీసేయడానికి కారణం?

బుస కొట్టే ప్రతి పాము కాటు వేయలేదు నాగబాబు

సీఎం జగన్ కు కొత్త తరహా రాజకీయం నేర్పుతున్న ఈనాడు అండ్ చంద్రబాబు